Skip to content
Home » కోసలాధీశుండు ఉయ్యాలో – దశరథ నాముండు ఉయ్యాలో Song Lyrics In Telugu

కోసలాధీశుండు ఉయ్యాలో – దశరథ నాముండు ఉయ్యాలో Song Lyrics In Telugu

 

కోసలాధీశుండు ఉయ్యాలో – దశరథ నాముండు ఉయ్యాలో Song Lyrics In TeluguGudur Venkatesh Swamy Lyrics

 

Singer Gudur Venkatesh Swamy
Singer Gudur Venkatesh Swamy
Music Gudur Venkatesh Swamy
Song Writer Gudur Venkatesh Swamy

కోసలాధీశుండు ఉయ్యాలో – దశరథ నాముండు ఉయ్యాలో కొండ కోనలు దాటి ఉయ్యాలో

– వేటకే బోయెను ఉయ్యాలో – అడవిలో దిరిగెను ఉయ్యాలో – అటు ఇటు జూచెను ఉయ్యాలో

– చెట్టు గుబురుల చాటు ఉయ్యాలో – చెరువొకటి కనిపించె ఉయ్యాలో – శబ్దమేదో వినెను ఉయ్యాలో

– శరమును సంధించె ఉయ్యాలో – జంతువేదొ జచ్చె ఉయ్యాలో –

అనుకొని సాగెను ఉయ్యాలో – చెంతకు చేరగా ఉయ్యాలో –

చిత్తమే కుంగెను ఉయ్యాలో – కుండలో నీళ్ళను ఉయ్యాలో –

కొన్ని వచ్చిన ఉయ్యాలో – బాలుని గుండెలో ఉయ్యాలో –

బాణమే గ్రుచ్చెను ఉయ్యాలో – ఎవ్వరు నువ్వనె ఉయ్యాలో –

ఏడ్పుతో దశరథుడు ఉయ్యాలో – శ్రవణుడు నేననె ఉయ్యాలో –

చచ్చేటి బాలుడు ఉయ్యాలో – తప్పు జరిగెనంచు ఉయ్యాలో –

తపియించెను రాజు ఉయ్యాలో – చావు బతుకుల బాలుడుయ్యాలో –

సాయమే కోరెను ఉయ్యాలో – నా తల్లిదండ్రులు ఉయ్యాలో –

దాహంతో ఉండిరి ఉయ్యాలో – ఈ నీళ్ళు గొంపోయి ఉయ్యాలో –

ఇచ్చి రమ్మనెను ఉయ్యాలో – ఆ నీళ్ళతో రాజు ఉయ్యాలో –

అడవంతా వెదికె ఉయ్యాలో – ఒకచోట జూచెను ఉయ్యాలో –

ఒణికేటి దంపతుల ఉయ్యాలో – కళ్ళైన లేవాయె ఉయ్యాలో –

కాళ్ళైన కదలవు ఉయ్యాలో – వృద్ధ దంపతుల జేరి ఉయ్యాలో –

వేదన చెందుతూ ఉయ్యాలో – సాష్టాంగ పడె రాజు ఉయ్యాలో –

సంగతి జెప్పెను ఉయ్యాలో – పలుకు విన్నంతనే ఉయ్యాలో –

పావమా వృద్ధులు ఉయ్యాలో – శాపాలు బెట్టిరి ఉయ్యాలో –

చాలించిరి తనువులుయ్యాలో – శాపమే ఫలియించి ఉయ్యాలో –

జరిగె రామాయణం ఊయ్యాలో – లోక కల్యాణమాయె ఉయ్యాలో –

లోకమే మెచ్చెను ఉయ్యాలో