Skip to content
Home » Okkesi Puvvesi Sandamama Bathukamma Songs Lyrics In Telugu

Okkesi Puvvesi Sandamama Bathukamma Songs Lyrics In Telugu

 

Okkesi Puvvesi Sandamama Bathukamma Songs Lyrics In Telugumangli Lyrics

 

Singermangli
Singermangli
Musicmangli
Song Writermangli

ఒక్కేసి పువ్వేసి చందమామ

రాశిపడబోసి చందమామ

రాశికలుపుదాం రావె చందమామ

రత్నాలగౌరు చందమామ

నీరాశి కలుపులు మేం కొలువమమ్మ

తీగెతీగెల బిందె రాగితీగెల బిందె నీనోము

నీకిత్తునే గౌరమ్మ నానోమునాకీయవే గౌరమ్మ

అదిచూసిమాయన్న గౌరమ్మ

ఏడుమేడలెక్కిరి గౌరమ్మ

ఏడుమేడలమీద పల్లెకోటల

మీద పల్లెకోటలమీద పత్రీలు కోయంగ
దొంగలెవరో దోచిరీ గౌరమ్మ బంగారు

గుండ్ల పేరు గౌరమ్మ దొంగతో దొరలందరూ గౌరమ్మ

బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ

రెండేసిపూలేసి రాశిపడబోసి గౌరమ్మ

బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ

మూడేసిపూలేసి రాశిపడబోసి గౌరమ్మ

బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ

(నాలుగు ఐదు ఆరు ఏడేసి పూలేసి రాశిపడబోసి గౌరమ్మ

బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ)