Skip to content
Home » Kulamela Mathamela Song Lyrics In telugu

Kulamela Mathamela Song Lyrics In telugu

Kulamela Mathamela Song Lyrics In teluguHariharan Lyrics

 

SingerHariharan
SingerAr.rahaman
MusicAr.rahaman
Song WriterVeturi Sundararama Murthy

మతమేల గతమేల మనసున్న నాడు
హితమేదో తెలియాలి మనిషైన వాడు
నీ దేశమే పూవనం
పూవై వికసించనీ జీవితం

కన్నీట కడగాలి
కులమన్న పాపం
మత రక్త సిందూరం
వర్ణాలు అరుణం
గాయాల నీ తల్లికీ
కన్నా!
జో లాలి పాడాలిరా

సరిహద్దులే దాటు ఆ గాలిలా

ప్రసవించనీ ప్రేమనే హాయిగా
నదులన్నీ కలిసేటి కడలింటిలో
తారల్లు విరిసేది గగనాలలో
కలలోకి జారేను ఈ రాత్రులే
వెలిగించి నవ్యోదయం

మతమేల గతమేల మనసున్న నాడు
హితమేదో తెలియాలి మనిషైన వాడు
నీ దేశమే పూవనం
పూవై వికసించనీ జీవితం

తల ఎత్తి నిలవాలి నీ దేశము
ఇల మీదనే స్వర్గమై
భయమన్నదే లేని భవితవ్యము
సాధించరా సంఘమై

ఒక మాట
ఒక బాట
ఒక ప్రాణమై
సాగాలిరా ఏకమై