Bathukamma Bathukamma Uyyalo Song Lyrics In Telugu – Telu Vijaya Lyrics
Singer | Telu Vijaya |
Singer | Telu Vijaya |
Music | Telu Vijaya |
Song Writer | Telu Vijaya |
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో

ఆనాటి కాలాన ఉయ్యాలో… దర్మాంగుడను రాజు ఉయ్యాలో

ఆ రాజు భార్యయు ఉయ్యాలో… అతి సత్యవతి యండ్రు ఉయ్యాలో
ఆ రాజు భార్యయు ఉయ్యాలో… అతి సత్యవతి యండ్రు ఉయ్యాలో…
నూరు నోములు నోమి ఉయ్యాలో… నూరు మందిని కాంచె ఉయ్యాలో

వారు సూరులై ఉయ్యాలో… వైరులచే హతమయిరి ఉయ్యాలో

తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో… తరగని సోకమున ఉయ్యాలో

ధన ధాన్యములను బాసి ఉయ్యాలో… దాయదులను బాసి ఉయ్యాలో

వనితతో ఆ రాజు ఉయ్యాలో… వనమందు నివసించే ఉయ్యాలో

కలికి లక్ష్మిని కూర్చి ఉయ్యాలో… ఘనత పొందిరింక ఉయ్యాలో

ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో… పలికి వరమడగమనే ఉయ్యాలో

వినిపించి వెడదిని ఉయ్యాలో… వెలది తన గర్భమున ఉయ్యాలో

పుట్టుమని వేడగా ఉయ్యాలో… పూబోణి మది మెచ్చి ఉయ్యాలో

సత్యవతి గర్భమున ఉయ్యాలో… జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో

అంతలో మునులును ఉయ్యాలో… అక్కడికి వచ్చిరి ఉయ్యాలో

కపిల గాలములు ఉయ్యాలో… కష్యపాంగ ఋషులు ఉయ్యాలో

అత్రి వశిష్టులు ఉయ్యాలో… ఆగండ్రి నను చూచి ఉయ్యాలో

బ్రతుకగనే ఈ తల్లి ఉయ్యాలో… బతుకమ్మ యనిరంత ఉయ్యాలో

పిలువుగా అతివలు ఉయ్యాలో… ప్రియముగా తల్లిదండ్రులు ఉయ్యాలో

బతుకమ్మ యనుపేరు ఉయ్యాలో… ప్రజలంత అందురు ఉయ్యాలో

తానూ ధన్యుడంచు ఉయ్యాలో… తన బిడ్డతో రారాజు ఉయ్యాలో

నిజ పట్నముకేగి ఉయ్యాలో… నేల పాలించగా ఉయ్యాలో

శ్రీ మహా విష్ణుండు ఉయ్యాలో… చక్రాంగుడను పేర ఉయ్యాలో

రాజు వేషమున ఉయ్యాలో… రాజు ఇంటికి వచ్చి ఉయ్యాలో

ఇల్లింట మనియుండి ఉయ్యాలో… అతివ బతుకమ్మను ఉయ్యాలో

పెండ్లాడి కొడుకుల ఉయ్యాలో… పెక్కు మందిని కాంచె ఉయ్యాలో
పెండ్లాడి కొడుకుల ఉయ్యాలో… పెక్కు మందిని కాంచె ఉయ్యాలో…
ఆరు వేల మంది ఉయ్యాలో… అతి సుందరాంగులు ఉయ్యాలో

ధర్మంగుడను రాజు ఉయ్యాలో… తన భార్య సత్యవతి ఉయ్యాలో

సిరిలేని సిరులతో ఉయ్యాలో… సంతోషమొందిరి ఉయ్యాలో

జగతిపై బతుకమ్మ ఉయ్యాలో… శాస్వతమ్ముగా వెలిసే ఉయ్యాలో