Skip to content
Home » Gandharva Lokala Song Lyrics In Telugu

Gandharva Lokala Song Lyrics In Telugu

Gandharva Lokala Song Lyrics In TeluguHemachandra & Ramya Behra Lyrics

 

SingerHemachandra & Ramya Behra
SingerM M Keeravani
MusicM M Keeravani
Song WriterChandra Bose

గంధర్వ లోకాల… సౌందర్య రాగానివో
ఎవరివో ఎవరివో
శృంగార కావ్యాల… లావణ్య తేజానివో
ఎవరివో ఎవరివో

ఆనంద క్షేత్రాల… అపరంజి పుష్పాన్నివో
ఎవరివో ఎవరివో
అందాల ఆలయంలో… ప్రాణ శిల్పానివో
ఎవరివో ఎవరివో

ఊగేటి ఊగేటి మేఘమాలవో
ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో
ఊగేటి ఊగేటి పూల బాలవో
ఎవరివో ఎవరివో… ఎవరివో హో హో

తడిపొడి అందాల నాట్యశాలవో, ఓ ఓఓ ఓ హో
కులుకుల పరువాల కళాశాలవో, ఓ ఓ ఓఓ
పెదవుల అమృతాన పానశాలవో, ఓ ఓఓ ఓ హో
చెదరని సౌఖ్యాల స్వర్గశాలవో

అలజడులాడవిలోన తప్పిపోయిన నన్ను
పిలిచేటి పర్ణశాలవో
ఆ నింగికి ఈ నేలకి ఉయ్యాల కట్టిసి
ఊగేటి ఊగేటి మేఘమాలవో
ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో
ఊగేటి ఊగేటి పూల బాలవో
ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో

గంధర్వ లోకాల… సౌందర్య రాగానివో
ఎవరివో ఎవరివో
శృంగార కావ్యాల… లావణ్య తేజానివో
ఎవరివో ఎవరివో, హో ఓఓ ఓ ఓ