Eyy Bidda Idhi Naa Adda Lyrics Song In Telugu

Written by Song Lyrics

Published on:

Eyy Bidda Idhi Naa Adda Lyrics Song In TeluguNakash Aziz Lyrics

 

SingerNakash Aziz
SingerDevi Sri Prasad
MusicDevi Sri Prasad
Song WriterChandra Bose

ఆ పక్కా నాదే… ఈ పక్కా నాదే
తలపైన ఆకాశం ముక్కా నాదే
ఆ తప్పు నేనే… ఈ ఒప్పు నేనే
తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే

నన్నైతే కొట్టేటోడు… భూమ్మీదే పుట్టలేదు
పుట్టాడా అది మళ్ళా నేనే
నను మించి ఎదిగెటోడు
ఇంకోడున్నాడు సూడు
ఎవడంటే అది రేపటి నేనే

నే తిప్పాన మీసమట
సేతిలోన గొడ్డలట
సేసిందే యుద్ధమట
సెయ్యందే సంధి అటా

ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా
ఏయ్ బిడ్డ..! ఇది నా అడ్డా
ఏయ్ బిడ్డ..! ఇది నా అడ్డా
అరె, ఏయ్ బిడ్డ… ఇది నా అడ్డా

నిను ఏట్లో ఇసిరేస్తా
నే సేపతో తిరిగొస్తా
గడ కర్రకు కుచ్చేస్తా
నే జెండాల ఎగిరేస్తా

నిను మట్టిలో పాతేసి
మాయం చేస్తా
నే ఖరీదైన ఖనిజంలా
టెన్ టు ఫైవ్ మళ్ళీ దొరికేస్తా

ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా
ఏయ్ బిడ్డ..! ఇది నా అడ్డా
ఏయ్ బిడ్డ..! ఇది నా అడ్డా
అరె, ఏయ్ బిడ్డ… ఇది నా అడ్డా

ఎవడ్రా ఎవడ్రా నువ్వు..?
ఇనుమును ఇనుమును నేను
నను కాల్చితే కత్తౌతాను

ఎవడ్రా ఎవడ్రా నువ్వు..?
మట్టిని మట్టిని నేను
నను తొక్కితే ఇటుకౌతాను
ఎవడ్రా ఎవడ్రా నువ్వు..?
రాయిని రాయిని నేను
గాయం గాని చేశారంటే
ఖాయంగా దేవున్నౌతాను

ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా
ఏయ్ బిడ్డ..! ఇది నా అడ్డా
ఏయ్ బిడ్డ..! ఇది నా అడ్డా
లే లే తగ్గేదే లే
అరె, ఏయ్ బిడ్డ… ఇది నా అడ్డా
లే లే తగ్గేదే లే

🔴Related Post